TSK

TSK · రోమీయులకు రాసిన పత్రిక 2:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అప్పుడు అమ్మోనీయుల ప్రజల నాయకులు రాజైన హానూనుతో ఇలా చెప్పారు “నీ తండ్రి మీద గౌరవంతో మాత్రమే దావీదు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి మనుషులను పంపాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దాన్ని పరిశీలించడానికి అతడు తన గూఢచారులను పంపించాడని నీకు అనిపించలేదా?”

నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.

¶ భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు.

¶ కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?

నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.

‹ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా?›

కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.

ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.