TSK

TSK · జెకర్యా 14:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.

యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.

¶ యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను.

అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.