TSK

TSK · జెకర్యా 14:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.

వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.

అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.

¶ దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.

¶ ఆ తరువాత నాలుగో రాజ్యం అధికారంలోకి వస్తుంది. అది ఇనుములాగా బలంగా ఉంటుంది. ఇనుము అన్నిటినీ ముక్కలుగా పగలగొట్టి పిండి చేస్తుంది గదా. ఇనుము పగలగొట్టినట్టు అది మిగిలిన రాజ్యాలన్నిటినీ పగలగొట్టి పిండి చేస్తుంది.

యెహోవా చెప్పేదేమిటంటే, నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. నీ కొడుకులూ కూతుళ్ళు కత్తితో హతమౌతారు. శత్రువులు నీ భూమిని కొలిచి పంచుకుంటారు. నువ్వు అపవిత్ర దేశంలో ప్రాణం విడుస్తావు. కచ్చితంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి బందీలవుతారు.

¶ దేశమంతటిలో మూడింట రెండు వంతులవారు నశిస్తారు. మూడవ భాగం మిగిలి ఉంటారు.

¶ ‹“యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.›

¶ ‹అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.›

¶ ‹ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.›

‹ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.›

¶ “ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు.