TSK

TSK · జెకర్యా 14:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.

చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.

నీ సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ వెన్నెల తగ్గదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దుఃఖదినాలు అంతం అవుతాయి.

దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”

¶ ‹“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.›

¶ ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.

¶ అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది.

¶ అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.