TSK

TSK · జెకర్యా 2:9

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.

యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు.

చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.

ఆ రోజున ఐగుప్తు ప్రజలంతా స్త్రీల వలే ఉంటారు. సేనల ప్రభువు అయిన యెహోవా వారిపై తన చెయ్యి ఎత్తుతాడు. దాని కారణంగా వాళ్ళు భయపడి వణుకుతారు.

దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ! ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ! నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు. నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.

నీ ఓడ తాళ్లు వదులై పోయాయి. స్తంభం అడుగు భాగం స్థిరంగా లేదు. ఓడ తెరచాపను ఎవరూ విప్పడం లేదు. విస్తారమైన దోపిడీ సొమ్మును పంచుకుంటారు. అప్పుడు కుంటి వాళ్ళు కూడా ఆ సొమ్ములో భాగం పొందుతారు.

ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీ మీద ప్రకాశింపదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.

అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు.

ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

¶ నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.

¶ నా జీవం తోడు మోయాబు దేశం సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి. అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు. నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.

సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మిమ్మల్ని దోచుకొన్న ఇతర దేశాల ప్రజల దగ్గరికి ఆయన నన్ను పంపించాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. అందువల్ల ఆయనకు ఘనత కలిగేలా,

దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”

‹అది జరగక ముందే, ఇప్పుడు దీన్ని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు నేను› ఉన్నవాణ్ణి ‹అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.›