అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.
TSK
TSK · జెకర్యా 7:2
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి.
వారికి అప్పగించి “మీరు యెహోవాకు ప్రతిష్ట అయినవారు, పాత్రలు కూడా ప్రతిష్ట అయినాయి. ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా కోసం ఇచ్చిన అర్పణలు.
యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము” అని చెప్పారు.
¶ ఒక పట్టణంవారు మరొక పట్టణం వారి దగ్గరికి వచ్చి ‘ఆలస్యం లేకుండా యెహొవాను శాంతింప జేయడానికి, సేనల ప్రభువు యెహోవాను వెదకడానికి మనం పోదాం రండి’ అని చెప్పగా వారు ‘మేము కూడా వస్తాము’ అంటారు.”