TSK

TSK · 1 దిన 13:2

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు” అని చెప్పాడు.

“తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.

“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు.

కానీ యెహోరాము సిరియా రాజు హజాయేలుతో చేస్తున్న యుద్ధంలో సిరియా సైన్యం చేసిన గాయాలను బాగు చేసుకోడానికి యెజ్రెయేలుకి తిరిగి వచ్చాడు. అప్పుడు యెహూ రాజు సేవకులతో “ఇదే మీ అభిప్రాయమైతే యెజ్రెయేలుకి ఈ వార్త వెళ్ళడానికి వీలు లేదు. ఈ పట్టణం విడిచి ఎవరూ తప్పించుకుని వెళ్ళకుండా చూడండి” అని చెప్పాడు.

తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.

అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.

సజీవుడైన దేవుణ్ణి దూషించడానికి తన యజమాని అష్షూరు రాజు పంపిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడు యెహోవా ఒకవేళ విని, ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి ఇప్పటికి బతికి ఉన్న మన కొద్దిమంది కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చెయ్యి.’”