TSK

TSK · 1 దిన 24:2

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.

అహరోనుకు, అతని కొడుకులకూ నడికట్లు కట్టి వారికి టోపీలు పెట్టాలి. ఈ విధంగా అహరోనును, అతని కొడుకులను ప్రతిష్టించాలి. యాజకత్వ నిర్వహణ పదవి వారికి చెందుతుంది. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కట్టుబాటు.

¶ అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.

కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు.

కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు.