యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు.
TSK
TSK · 2 దిన 16:14
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
వారు అశాహేలును తీసుకువెళ్ళి బేత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తరువాత యోవాబు, అతని మనుషులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.
హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. ప్రజలు దావీదు సంతతివారి శ్మశానభూమిలోని పై భాగంలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదావారంతా యెరూషలేము నివాసులంతా అతనికి అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని స్థానంలో అతని కొడుకు మనష్షే రాజయ్యాడు.
¶ పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది.
నీకంటే ముందుగా ఉన్న పూర్వపు రాజులైన నీ పితరులను దహనం చేసినట్టు నీ శరీరాన్ని దహనం చేస్తారు.’ అప్పుడు వాళ్ళు ‘అయ్యో, ప్రభూ!’ అంటారు. నీ కోసం ఏడుస్తారు. అలా జరగాలని పలికిన వాణ్ణి నేనే. ఇదే యెహోవా వాక్కు.”
మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.