TSK

TSK · 2 దిన 17:11

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అతడు మోయాబీయులను ఓడించి, పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. రెండు కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలనీ, ఒక కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలనీ నిర్ణయించాడు. అప్పటినుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు.

¶ మోయాబు రాజు మేషాకు విస్తారమైన మేకల, గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి ఒక లక్ష గొర్రె పిల్లలనూ, లక్ష గొర్రె పొట్టేళ్ల ఉన్నినీ పన్నుగా కడుతుండేవాడు.

ఒక్కొక్కరూ ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకు వచ్చారు.

అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకూ ఐగుప్తు వరకూ వ్యాపించింది.