¶ రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు.
TSK
TSK · 2 దిన 29:10
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయ వాంఛ.
¶ వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు.
రాజూ, యూదావారంతా, యెరూషలేము నివాసులంతా, యాజకులూ, లేవీయులూ, ప్రజల్లో గొప్పవారూ, సామాన్యులూ యెహోవా మందిరానికి వచ్చారు. ఆప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు.
ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.
“నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?” అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు.
¶ “మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు.
సీయోనుకు వెళ్ళే మార్గం ఏది అంటూ వాకబు చేస్తారు. ఆ మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు. ఉల్లంఘించలేని శాశ్వత నిబంధనలో యెహోవాను కలవడానికి కలిసి వెళ్తారు.