TSK

TSK · 2 దిన 6:16

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.

అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.

నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే,

¶ ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా

¶ ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు. “యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం, రాజు కుమారుడు పరిపాలన చేయాలి.”

ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

¶ యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను.