TSK

TSK · 2 సమూ 6:10

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకూ అక్కడే కాపురం ఉన్నారు.

దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు.

ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు “నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను” అని వారితో చెప్పాడు.

వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.

¶ వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు.