TSK

TSK · అపొస్తలుల కార్యములు 7:34

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.

¶ ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.

¶ అందుకు దేవుడు “ నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.

ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.

¶ వారి శత్రువులు వారిని బాధించగా, ఆ మూలుగులు యెహోవా విని, జాలిపడి, వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి, ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు.

నీవు నీతిమంతుడివి గనక నువ్విచ్చిన మాట ప్రకారం జరిగించావు. ఐగుప్తులో మా పూర్వికులు అనుభవించిన కష్టాలు నువ్వు చూశావు. ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విని కాపాడావు.

అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.

అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.

¶ ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు.

‹పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.›