TSK

TSK · ద్వితీ 34:7

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.

ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు.

మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది.

ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.

నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.