ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.
TSK
TSK · ద్వితీ 5:6
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.
యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు.
¶ అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.
నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. సెలా.
ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’”