TSK

TSK · నిర్గమ 10:14

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.

¶ అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.

¶ దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,

ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,

పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?

¶ సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.

¶ ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదికి వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తిలాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది.