¶ పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.
TSK
TSK · నిర్గమ 30:23
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.
నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి.
నువ్వు పూసుకునేవి ఎంతో సువాసన ఉన్న పరిమళ తైలాలు. నీ పేరు ప్రవహిస్తున్న పరిమళం, అందుకే యువతులు నిన్ను ఇష్టపడతారు.
కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి. బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.
షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు? మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.
¶ షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.