TSK

TSK · హోషేయ 9:13

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు.

¶ ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.

సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.

¶ నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది. ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.

¶ షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.

యెహోవా చెప్పేదేమిటంటే, నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. నీ కొడుకులూ కూతుళ్ళు కత్తితో హతమౌతారు. శత్రువులు నీ భూమిని కొలిచి పంచుకుంటారు. నువ్వు అపవిత్ర దేశంలో ప్రాణం విడుస్తావు. కచ్చితంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి బందీలవుతారు.