TSK

TSK · హోషేయ 9:7

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?

అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం.

శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.

అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.

వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”

‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.

¶ నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.

“నరపుత్రుడా, ‘రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది’ అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి?

¶ శాంతి లేకుండానే ‘శాంతి’ అని ప్రవచిస్తూ నా ప్రజలను వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక గోడ కట్టి దానిపై సున్నం పూస్తున్నారు

ఆగ్రహంతో వాళ్ళను శిక్షించి, వాళ్ళ మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. నేను నా పగ తీర్చుకున్నప్పుడు, నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.”

¶ శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది. తప్పనిసరిగా జరగబోయే దాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను.

ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.

వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.

¶ దాని ప్రవక్తలు పెంకెతనం గలవారు, విశ్వాస ఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు.

ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు.

¶ అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.