TSK

TSK · యెషయా 14:26

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది.

యెహోవా తన చేతిని సముద్రంపై చాపాడు. ఆయన రాజ్యాలను కంపింపజేశాడు. కనానులో కోటలను నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు.

¶ నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి. ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి. జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే.