TSK

TSK · యెషయా 23:13

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.

అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.

¶ తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.

¶ ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.

¶ “నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ

ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.

కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.

¶ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “అత్యంత శక్తివంతుడైన బబులోనురాజు నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పిస్తున్నాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తున్నాడు.

అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు.

¶ “అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు.