TSK

TSK · యెషయా 24:18

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.

¶ అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.

అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అన్నాడు. దానికి ఎలీషా “చూస్తూ ఉండు. అలా జరగడం నీవు కళ్ళారా చూస్తావు గానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు.

ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.

ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.

కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

¶ యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.