TSK

TSK · యిర్మీయా 2:25

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ యెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు.

వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.

ఎలాగంటే “అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి.

ఆ రోజుల్లో యెహోవా ఆమోజు కొడుకు యెషయా ద్వారా మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్ళు. నీ నడుముకి కట్టుకున్న గోనె పట్టా విప్పు. నీ పాదాలకున్న జోళ్ళు విడిచిపెట్టు.” అతడు అలాగే చేశాడు. చెప్పులు లేకుండా, వట్టి కాళ్ళతో నడిచాడు.

నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.

యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.

నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను. అయితే “నేను వినను” అని నువ్వన్నావు. చిన్నప్పటినుంచి నువ్వు నా మాట వినకుండా ఉండడం నీకు అలవాటే.

¶ దప్పిక వల్ల పాలు తాగే పిల్ల నాలుక దాని అంగిటికి అంటుకుంటూ ఉంది. పిల్లలు అన్నం అడుగుతారు, కాని వాళ్ళు తినడానికి ఏమీ లేదు.

¶ ‹“అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి.›

దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?