TSK

TSK · యోబు 31:32

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.

దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను.

ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం. దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

‹అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.›

అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు.