TSK

TSK · యూదా పత్రిక 1:13

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.

యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను. దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.

అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.

¶ మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.

¶ వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.