TSK

TSK · న్యాయా 19:3

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను” అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు.

¶ వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.

¶ కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. “నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను” అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.

ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.

¶ “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.”

¶ వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

¶ సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.