¶ మీ కొడుకులను, కూతుళ్ళను అన్య జనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురు చూస్తూ అలిసిపోతాయి గానీ మీ వల్ల ఏమీ జరగదు.
TSK
TSK · విలాప వాక్యములు 1:18
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
¶ మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి.
¶ ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
¶ మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మాపైకి వచ్చాయి. మా దేవుడవైన నువ్వు మా దోషాలకు రావలసిన శిక్షను తగ్గించి మాకు ఈ విధంగా విడుదల కలిగించావు.
వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.
దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.
యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?
మేము తాగమని వాళ్ళు నీ చేతిలో నుంచి ఆ పాత్రను తీసుకోకపోతే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు, మీరు తప్పకుండా దాన్ని తాగాలని సేనల అధిపతి యెహోవా చెబుతున్నాడు.
¶ యెహోవా ఇలా చెప్తున్నాడు. “పాత్రలోని దాన్ని తాగాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా కచ్చితంగా పాత్రలోది కొంత తాగుతున్నారు. అలాంటప్పుడు నువ్వు శిక్షను ఎలా తప్పించుకుంటావు. తప్పించుకోలేవు. ఆ పాత్రలోది తప్పకుండా తాగాల్సిందే.
¶ దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా? యెహోవాకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున నాకు కలిగించిన బాధవంటి బాధ ఇంకా ఎవరికైనా కలిగిందేమో మీరు ఆలోచించి చూడండి.
¶ మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
¶ ప్రభూ, నీవే నీతిమంతుడవు. మేము నీ మీద తిరుగుబాటు చేశాము. యెరూషలేములో, యూదయ దేశంలో నివసిస్తున్న వారందరి ముఖాలకు, ఇశ్రాయేలీయులందరి ముఖాలకు సిగ్గే తగినది. నీవు చెదరగొట్టిన స్వదేశవాసులకు, పర దేశవాసులకు ఇదే శాస్తి. మేము నీ పట్ల చేసిన గొప్ప నమ్మక ద్రోహానికి ఇదే శిక్ష.
¶ అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేసేవాడు కాడు. అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు. ఆయనకు రహస్యమైనదేమీ లేదు. అయినా నీతిహీనులకు సిగ్గులేదు.
¶ నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.
¶ వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు. సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.