TSK

TSK · విలాప వాక్యములు 4:19

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.

“అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు.

ఇదే యెహోవా వాక్కు. “వాళ్ళను పట్టుకోడానికి నేను చాలామంది జాలరులను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుంచి ప్రతి కొండ మీద నుంచి మెట్టల సందుల్లోనుంచి వారిని వేటాడి తోలివేయడానికి చాలామంది వేటగాళ్ళను పిలిపిస్తాను.

¶ “బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు.”

¶ చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.

¶ వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.