నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను” అని అబ్రాముతో చెప్పాడు.
TSK
TSK · లేవీ 14:34
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
“మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
¶ నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.
“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి.
మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం” అని జవాబిచ్చారు.
¶ “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు.
¶ “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.
¶ “మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.
మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.
¶ యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది.
¶ దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.
పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?
¶ వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.