TSK

TSK · లూకా 20:37

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.

తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.

అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.

భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక.

‹ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు.›