TSK

TSK · మీకా 6:7

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.

అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషా రాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.

అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది.

నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.

నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు.

అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు.

¶ సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.

వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”

వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.

నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.