TSK

TSK · సంఖ్యా 29:39

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ ప్రజలు యెహోవాకు అర్పించే శాంతి బలిని గూర్చిన చట్టం ఇది.

ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు.

ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం.

¶ మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.”

మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.

¶ యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు.

¶ ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు పర్ణశాలల పండగ ఆచరించి, ఏ రోజు ఆచరించాల్సిన నియమాలను లెక్క ప్రకారం ఆ రోజుల్లో ఆచరిస్తూ దహనబలులు అర్పిస్తూ వచ్చారు.

బల్లమీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహన బలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగల విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధంగా నడుచుకొంటామని నిర్ణయం తీసుకున్నాం.

¶ కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.