వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది.
TSK
TSK · సామెత 21:16
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.
¶ ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు.
¶ జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
¶ యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”
¶ మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు
¶ సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు.
¶ వారు, నీతి మార్గాన్ని తెలుసుకున్న తరువాత తమకు అందిన పవిత్ర ఆజ్ఞ నుండి తప్పిపోవడం కన్నా అసలు ఆ మార్గం వారికి తెలియకుండా ఉండడమే మేలు.
¶ వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.