TSK

TSK · సామెత 22:11

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.

¶ ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న లేఖికుడు. దేవుడైన యెహోవా కాపుదల అతనిపై ఉండడం వల్ల అతడు ఏమి కోరినా రాజు అతని మనవులు అంగీకరించాడు.

యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.

దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

¶ సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.

¶ అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు.

‹పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.›