TSK

TSK · సామెత 25:8

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అబ్నేరు కేక వేసి “కత్తి ఎప్పుడూ చంపుతూనే ఉండాలా? అది చివరకూ కీడుకే కారణం అవుతుందని నీకు తెలుసు గదా. మీ సోదరులను తరమడం ఆపమని నీ మనుషులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.

¶ అప్పుడు అమజ్యా ఇశ్రాయేలు రాజు యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకు యెహోయాషు దగ్గరికి వార్తాహరులను పంపి “మనం ముఖాముఖి యుద్ధం చేద్దాం రా” అన్నాడు.

¶ పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.

¶ పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.

ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?

¶ ‹“అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా?›