TSK

TSK · సామెత 27:21

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.

¶ ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.

తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరి పట్లా అబ్షాలోము ఈ విధంగా చేసి ఇశ్రాయేలీయులనందరినీ తనవైపు ఆకర్షించుకున్నాడు.

యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.

¶ వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.

ఆయన వెండిని పరీక్షించి పుటం పెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను శుద్ధి చేసి పుటంపెట్టే విధంగా ఆయన లేవీ గోత్రం వారిని శుద్ధి చేస్తాడు. అప్పుడు వాళ్ళు నీతి నియమాలను అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.

¶ ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.