TSK

TSK · రోమీయులకు రాసిన పత్రిక 12:15

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.

బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?

యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి.

¶ అక్కడ నుంచి పాతబడి చీకిపోయి, చినిగిపోయిన బట్టలు తీసుకువెళ్లి, ఆ గోతిలో ఉన్న యిర్మీయా పట్టుకునేలా తాళ్ళతో వాటిని దింపి “పాతవై చిరిగి చీకిపోయిన ఈ బట్టలతో పేనిన తాళ్ళను నీ చంకల కింద పెట్టుకో,” అని అతనితో చెప్పాడు.

‹అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి›

¶ ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, ‹“అతణ్ణి ఎక్కడ పెట్టారు?”› అన్నాడు.

కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.

మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?

అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు.

మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.