TSK

TSK · 2 దిన 34:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు.

¶ హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు.

¶ ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.

ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు. అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.”