TSK

TSK · 2 సమూ 2:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు.

అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు. అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు.

దావీదు “హానూను తండ్రి నాహాషు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి” అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్ళారు.

ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా.

‹కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.›

¶ ‹“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.›

ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.