TSK

TSK · అపొస్తలుల కార్యములు 7:23

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు.

¶ మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.

యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.

¶ అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు.

¶ రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.

¶ మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు.

¶ విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు.

¶ దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు.