TSK

TSK · ఆమోసు 5:16

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.

ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.

పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.

సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.

¶ తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు.

ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.

¶ కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, అని యెహోవా చెబుతున్నాడు. ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

¶ ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.

తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.