TSK

TSK · హోషేయ 2:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.

¶ వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.

దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.

నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.

¶ యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను.

¶ ఆ మూడవ భాగాన్ని నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుభ్రపరచినట్టు శుద్ధి చేస్తాను. బంగారాన్ని పరీక్షించినట్టు వారిని పరీక్షిస్తాను. వారు నా నామాన్నిబట్టి మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను. “వీరు నా ప్రజలు” అని నేనంటాను. “యెహోవా మా దేవుడు” అని వారు అంటారు.

¶ కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.

ఒకప్పుడు మీరు ప్రజ కాదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు కనికరం పొందారు.