TSK

TSK · మత్తయి 2:4

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు.

¶ అంతేకాక యాజకులూ ప్రజల్లో నాయకులంతా అన్య ప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్టించిన మందిరాన్ని అపవిత్ర పరచారు.

¶ యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల, చట్టాల విషయంలో లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం నకలు.

సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా, అనేవాళ్ళు. వీళ్ళంతా యేషూవ రోజుల్లో యాజకుల్లో వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు.

“మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు? నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.

ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.

ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.

¶ ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు.

¶ తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.

¶ ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.

యేసు ఇలా అన్నాడు, ‹“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా?›

అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.

¶ మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.

అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు.