TSK

TSK · సంఖ్యా 1:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,

“నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.

వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.

¶ షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.

మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.

¶ తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.