TSK

TSK · సామెత 27:22

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. “మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?” అని చెప్పుకున్నారు.

¶ ఈ విషయం సౌలుకు తెలిసి మరి కొందరు సైనికులును పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడవసారి సైనికులను పంపాడు గాని వారు కూడా అలాగే ప్రకటించడం మొదలుపెట్టారు.

¶ తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు.

¶ “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.

యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.

¶ అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.