TSK

TSK · సామెత 7:26

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.

నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.

వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాను. “ఇలాంటి పనులు చేసి ఇశ్రాయేలీయుల రాజు సొలొమోను పాపం చేసాడు కదా. లోక ప్రజల్లో అతని వంటి రాజు మరొకడు లేకపోయినా, అతడు తన దేవుని ప్రేమను చూరగొన్నాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరిపై రాజుగా నియమించాడు. అయినప్పటికీ అన్య స్త్రీలు అతతో కూడా పాపం చేయించారు కదా.

¶ వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.

వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.

¶ ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను.