TSK

TSK · 1 దిన 12:40

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి.

ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు.

¶ ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.

¶ మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.

ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.