TSK

TSK · 1 దిన 17:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.

¶ దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు.

¶ మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను.

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.

మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. అమోరీయులూ పెరిజ్జీయులూ కనానీయులూ హీత్తీయులూ గిర్గాషీయులూ హివ్వీయులూ యెబూసీయులతో కలిసి యెరికో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను.

నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.

నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.

నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.

మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?

ఏ అన్యదేశాల ఎదుట నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నానో, ఏ అన్యప్రజల మధ్య వాళ్లున్నారో, ఆ అన్యప్రజల్లో, వాళ్ళున్న అన్యప్రజల ఎదుట వాళ్లకు నన్ను ప్రత్యక్షం చేసుకున్నాను. నా పేరుకు దూషణ కలగకుండా ఉండాలని ఆ విధంగా చెయ్యకుండా, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా ఘన నామం కోసం నేను వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించాను.