మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,
TSK
TSK · 1 దిన 18:11
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”
తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.
దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.
¶ ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.
¶ తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.
¶ చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది.
యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.
¶ సొలొమోను యెహోవా మందిరానికి తాను చేయించిన పనంతా పూర్తి చేసి, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండినీ బంగారాన్నీ వస్తువులన్నిటినీ దేవుని మందిరం ధనాగారాల్లో ఉంచాడు.
¶ యెహోవా ఇలా అంటున్నాడు, “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”